Tuesday, November 8, 2022

గజల్ రదీఫ్: నా మనసు తేది : 11-06-2022

 అంశం గజల్ 

గజల్ 
రదీఫ్:  నా మనసు 
తేది : 11-06-2022 


ప్రేమంటె మధురమని  వినుకుంది  నామనసు 
పెన్నిధిగ స్థిరమాయె అమిరింది నామనసు 

బాల్యమున బంధువులు తలుపులే నిలపగా 
అమ్మింటి బంధమే అనుకుంది  నామనసు 

మనువంటే మతలబులు తెలియకనే ఆరోజు 
మనసునా బీజంబు వేసుకుంది నా మనసు 

ఉద్యోగ  స్థితిమీద ఊళ్ళన్ని తిరిగినా 
ఊసులతొ ఊరేగి దోచుకుంది నా మనసు 

అడిగింది తడవుగా రాజాగ  తెలుపగా  
ఆకాశ వినువీధి చేరుకుంది నామనసు. 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment