నాకు దారి వదలండి
తేది : 07-07-2022
శీర్షిక : అబలను కాదు ....
కవిత సంఖ్య : 930
ఆత్మీయతలు పండించే అమ్మను
అనురాగాలు పంచంగ తోబుట్టువును
అర్ధభాగం పంచుకున్న ఇల్లాలును
అబలను కాదని అడుగడునా రూడీలే ....
అందుగలదు .. ఇందు లేదని కాదు
కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు
ఆటోల నుండి ఆకాశయానం వరకు ...
చివరకు వ్యోమగామిగా పయనమయాను ...
అడగడుగున హుంకరిస్తూ
అహంభావంతో అడ్డుపడకండి
కాగితాల మీద కవాతులు చేయిస్తూ
కాళ్ళడ్డు పెడుతూ కాలయాపన చేస్తున్నారు ...
తప్పొప్పులు ఎత్తి చూపకు
పదే పదే ఉదహరించకు
పొరపాట్లకు మూలం లింగ బేధమనకు
నీవైనా నేనయినా కర్మకు ప్రతినిధులం ... .
నా దారి నాకు వదలండి
నాకు నేనుగా నేనేంటో రుజువు
చేసుకునే మార్గమీయండి ...
పెత్తనం చేయడం మానేయండి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment