Tuesday, November 8, 2022

అంశం : గజల్ తేదీ : 10-06-22

 అంశం : గజల్ 

తేదీ : 10-06-22
కవిత సంఖ్య : 918 

తెలియలేదు పాలకులకు
తెగబడితే  అధికారం 
తెలుగువారి తెగువేంటో 
కట్టబెడితె అధికారం 

వరసబెట్టి పడతులనూ 
చెరబడితే చూస్తున్నరు 
ప్రమాణాలు మరిచిపోయి   
పట్టుబడితె అధికారం 

ఎన్నుకున్న ప్రభుత్వాలు 
పంజాబున చూపలేదా 
ఎదురించే పోరాటం 
కట్టుబడితె అధికారం 

చర్నకోల ఝుళిపించి 
చలాయించి నడపరాద 
చోద్యాలా యంత్రాఙ్గమ్ 
నిలబెడితే అధికారం 

బంగారూ తెలంగాణ 
భాగమేగ పడతులైనా 
చిన్నబుచ్చ అతివలంత 
పడగొడితే అధికారం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment