Tuesday, November 8, 2022

సరస గేయాలు తేది : 11-06-2022 శీర్షిక : కనకం ....

 సరస గేయాలు 

తేది : 11-06-2022
శీర్షిక : కనకం .... 
కవిత సంఖ్య : 919

కనవే  ఓ కనకం 
వినవే నా సరసం .... 

నీలాల కళ్ళలోన 
నిలిచిన మాయేదో 
ఆవరించి నన్నిపుడు 
అదేపనిగ పిలిచింది   //  కనవే // 

బుంగమూతి తిప్పినా 
బుద్దిగ నువు పలికినా 
బుగ్గమీది సోట్టేమో 
నొక్కుకు పోతూన్నది // కనవే   // 

కనవే  ఓ కనకం 
వినవే నా సరసం . 

దొండపండు పెదవులు 
దోబూచులాడుతుంటే 
బుగ్గలన్నీ ఎరుపెక్కి 
నునుసిగ్గులు పోతుంటే   // కనవే   // 

గాలికి ఈలలు నేర్పే  
కురులేమో కదులుతుంటే 
వింజామరలై విసిరి 
సరసాలే ఆడుతుంది    // కనవే   // 

కనవే  ఓ కనకం 
వినవే నా సరసం .

మనసంతా నిన్నేకోరి 
మరోసారి చూసుకున్నా 
ప్రేమంటే ఇదేనని 
మొదటిసారి తెలుసుకున్న //  కనవే // 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment