చిత్ర కవిత
తేది: 15-01-2022
శీర్షిక: సరస్వతీ పుత్రిక
కవిత సంఖ్య : 85+5
సూటు బూటుల సుందరి
కట్టూ బొట్టులో తానై అదిరింది
స్టూలు పైన సుతారంగా కూర్చున్నా
చుట్టమై పట్టుకుంది జ్ఞాన పీఠిక ...
చేయి తిరిగిన నైపుణ్యమో
చెలికాని మనసు బొమ్మనో
స్వచ్చంగా అచ్చుబోసిన సరస్వతీ పుత్రికలా
సదువుల తల్లై వల్లె వేస్తున్నది……
కొనగోట మీటెనా ... లేక
కోరికన చిత్రించెనా…అణువణువు
అద్భుతమే… తీరొక్క వెదురు అల్లికలతో
తీర్చి దిద్దే అంగ వస్త్రాలు … ఆపాదమస్తకం..
కలుషితాలెరుగని వెదురు
కాలగమనంలో కబోదిలా మారె…
కనుచూపు మేర కానరాక
కకావికలమయి…. కుదేలాయె నేడు…
ఏబదులలో ఏమార్చిన ప్లాస్టిక్కు భూతం..
ఏమి ఎరగనట్టు వెదురుకు పర్యాయమై నిలిచి
కలుషితాలు విరజిమ్ముతూ …
కబళిస్తుండె వేల జీవితాలను .....
వెదురును నమ్ముకున్న వేల్పులకు
నుదురు మీద అదృష్ట గీతలు కనుమరుగై
పాలకుల దృష్టికందని దురదృష్టాలతో ఎవరికి పట్టని పిట్ట బతుకులాయె…. ఈనాడు.
నగునూరి. రాజన్న
No comments:
Post a Comment