చిత్రానికి గజల్ ( కుమ్మరి సారె )
తేది 05-06-2022
రేగడీ మట్టితో చిత్రమే కుమ్మరీ
దాగినా పాత్రలూ కష్టమే కుమ్మరీ
చేతితో చిత్రంగ తింపెనే సారెనూ
మాయలూ లేకనే ఇష్టమే కుమ్మరీ
మట్టిలో రాళ్లను మర్మాంగా ఏరేవు
కుంకుమా పువ్వోలె
మిష్టరీ కుమ్మరీ
కాళ్లతో తొక్కావూ మట్టినీ కలపగా
ముద్దనూ చక్రంపై పెట్టావూ కుమ్మరీ
చేయితో చక్రాన్ని గుండ్రంగా తిప్పుతూ
పాత్రలూ చేశావు నిష్టగా కుమ్మరీ
ఎండినా కుండలూ వాములో పేర్చావు
చక్కగా కాలితే లాభమే కుమ్మరీ
కాలమే కలవంగా రాజుగా జీవించు
బాధలే తీరాలి బతుకంతా కుమ్మరీ
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment