సినారె
ప్రత్యేక కవిత
తేది : 12-06-2022
కవిత సంఖ్య : 137+5
పచ్చని పల్లెలో విచ్చుకున్న
నెచ్చెలి మల్లె పరిమళం ....
హన్మాజీపేటలో జన్మించిన
సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ....
కాలమాన పరిస్థితుల రీత్యా
కాలు మోపె ఉర్దూ మీడియంలో
మాతృబాష మహిమ తెలిసి
ఉన్నత విద్యను తెలుగులో చేసె ....
అమ్మ భాషలో సాహితీ సేద్యం చేసి
అపురూపమైన కవిత్వాన్ని పండించి
అనన్యమైన గ్రంథాలను ఆవిష్కరించారు ....
నవ్వని పువ్వుతో వికసించినా
కలం సాక్షిగా రెక్కల సంతకాలు
చేసినా.. మట్టి మనిషి ఆకాశమైనా
తేజస్సు నా తపస్సన్నా సాహితీధనుడు .
పద్మశ్రీ పద్మభూషణ్
కేంద్ర సాహిత్య అకాడమీ
బహుమతుల దండలే కాకుండా
విశ్వంభరతో విజయ బావుటా
ఎగరేసి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని
కైవసం చేసుకున్న కళా పోషకుడు ...
వేల కొలది పాటలతో వెలుగొంది
వెండితెరల జాడల్లో దండిదొరగా
పేరొందిన సినారె అగ్నిని రగిలించి
అమృతం కురిపించగల రెండంచుల
పదునుగల కత్తి ...
తెలంగాణ తల్లి ఒడిలో పురుడు
పోసుకున్న సాహితీ కుసుమం
విశ్వంభరతో విశ్వపు అంచులదాకా
ఘనకీర్తులను మూటగట్టుకున్న
తెలుగు తల్లి ముద్దుల తనయుడు...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment