కాఠిన్యం లేని చోట
తేది : 21-07-22
శీర్షిక : కావల్సిందే అప్పుడప్పుడు…
కవిత సంఖ్య : 942.
ఆత్మీయతలు నిండిన అమ్మ ప్రేమలు
పంచే మాతృమూర్తైనా అప్పుడప్పుడు
కరుకు కాఠిన్యం ప్రదర్శించపోతే
కాలు కదపలేని కుందేలే… పిల్లలల్లరికి .....
కరుణలు దండిగ నిండిన కన్నప్రేమలు
కూడా క్రమశిక్షణల కవాతు సమయంలో
మనసు పిట్టను ఉట్టెక్కించి... కన్నపిల్లల పట్ల
కొంతో గొప్పో కాఠిన్యం ప్రదర్శించాలి ....
కఠినమైన శిలకూడ కరిగి వరాలిచ్చు
బండరాళ్ళ కింద బలమైన ఊటలా…
కోరి మొక్కిన కొండమీది కోనేటిరాయుడిలా
ప్రశాంత జీవనానికి పట్టుకొమ్మై నిలుచు….
కాఠిన్యం లేనిచోట కరుణల చెమ్మ
నిండి పండదా కుసుమ పంట ...
మధురమైన భాషణ పరిమళాలు
వెదజల్లి తోయదా సత్యయుగపు కాంతి...
ఇంట్లో అమ్మానాన్నలైనా
దేశంలో ప్రజా నాయకులయినా
మంచికి...తలవంచే మంచి
చెడుకు చెడుగుడాడే కాఠిన్యం
ప్రదర్శిస్తేనే... రామరాజ్య సుభిక్షం..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment