Tuesday, November 8, 2022

ఓటమి తేది : 05-01-2022 శీర్షిక : విజయనానికి ఊతం ...

 ఓటమి 

తేది : 05-01-2022
శీర్షిక : విజయనానికి ఊతం ... 
కవిత సంఖ్య : 

గిర్ గిర్ కర్ చల్నా సీఖో 
అన్న గొప్ప  కవి పుంగవుని 
మాటల్లో దాగిన సత్యమే .... 
ఓటమెప్పుడూ శాశ్వతం కాదు ..... 
విజయానికి ఊతమే అది ..... 

ఓటమి పలకరించినపుడే
ప్రణాళికల సమీక్షలతో  
లోపాల వెతుకులాటాలు  
బలా బలాల బేరీజులేసి 
పట్టుదలలు పెట్టుబడులు 
తోడొస్తాయి ..... 
అకుంఠిత దీక్షలు అండ
దండలైపోతాయి 
ఓరిమి సంతరించుకోవాలి 
కారణమేంటో కనిపెట్టలేనప్పుడు 
కాలాడదు .... అడుగు కదలదు .... 



నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment