Tuesday, November 8, 2022

అంశం : గజల్ తేది: 29-04-22 గజలంటే గమ్మత్తులు

 అంశం : గజల్ 

తేది: 29-04-22
కవిత సంఖ్య : 892 

గజలంటే గమ్మత్తులు 
గణాలతో కవిత్వమే 
వైవిద్యముగ వ్యక్తపరుచు 
మాత్రరూప  కవిత్వమే 

అలతి అలతి పదాలతో 
అలరించే పదబంధం 
అలంకార ప్రయుక్తమూ
వచనరూప కవిత్వమే 

ఎడారుల్ల అంకురించి  
సేదదీర్చె  మానసముల
అరబ్బులది పారసిలది 
కలసిరూప కవిత్వమే 

భాషయును భావమును 
పఠనంతో పరిమళించు 
గానంతో వినువిందులు
వలసరూప కవిత్వమే  

అబ్బురాల వినోదమే 
ప్రియురాండ్రపై వెల్లడించ
ఛందస్సుల బంధనమే
రాజరూప కవిత్వమే   

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment