Tuesday, July 12, 2022

చిత్ర కవిత తేది: 11-02-2022 శీర్షిక: కొత్త కోణమే ....

 చిత్ర కవిత

తేది: 11-02-2022
శీర్షిక: కొత్త కోణమే .... 
కవిత సంఖ్య : 96+7

రంగు రంగుల కర కంకణముల 
సుందరమైన అలంకరణములతో
కవిత రాయ కార్య రంగమున దూకే 
వనిత సమాయత్తమై నఖశిఖము… 

కలము కాగితములు చేత బూనె 
కవితలల్లి కళామతల్లికి మాలవేయ... 
ప్రేమ వాక్యముల రాయబారమంప 
పెన్నిధిగ కూర్చుచుండె పదకుసుమములు ... 

మరులు గొన్న మయూర పింఛము నల్లనయ్యగ 
మరువలేని రాధమ్మ గుండె చిహ్నమై
దండి కావ్యమునకు శ్రీకారములు జుట్టి 
మెండుగ మెప్పులందు వాస్తవమ్ముగ ... 

సుందరమగు అంగుళీయకము 
సురలు సైతం మెచ్చే మణి కంకణములు 
మధుర సుధలొలికించే మయూర పించం 
కాదా ప్రేమ గీతమునకు రంగము సిద్ధం .... 

కన్నయ్య రాధమ్మల ప్రేమను రంగరించి 
కావ్య కన్యక లెన్ని ఆవిష్కరించినా ... 
కొంటె కోణంగి తుంటరి అల్లరులన్నీ ... 
ప్రతీది పరిమళించు ఓ కొత్త కోణమై  ... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment