పూల పడవ
తేది 09-02-2022
శీర్షిక : వాకిట వసంతాలు
కవిత సంఖ్య : 96+5
ఆత్మీయతలు నిండిన అమ్మానాన్నలు
అనురాగాలు పంచిన తోబుట్టువులు
అల్లుకుని ఆరాధించిన మిత్రబంధాలు
అనుకున్నట్టుగా సమకూరిన బాల్యం ...
గురి కుదిరిన గురుబోధనలు
కలగలిసిన విద్యా ఫలితాలు
కాలమై ఎదురొచ్చిన ఉద్యోగపర్వం ..
సమయానుకూలమై సంతసించిన జీవితం ...
మనసెరిగిన సహధర్మచారిణి ....
మాట విని పాటించే సంతానం ...
అంచనాలు మించిన ఉత్తీర్ణతలతో
ఆనందాలను మూట గట్టిస్తుంటే
ఇనుమడించిన సంతోషాల పొదరిల్లు ...
ఆటపాటల జీవితాలకు అనుగుణంగా ....
సప్తవర్ణాల శోభలనందిస్తూ ....
అప్పుగా ఆర్థికతలనందించి
ఓ ఇంటివాడివి కమ్మని దీవించె...
కాలుకు మట్టంటనీయని మాతృ సంస్థ
కంట నీరెరుగనీయని పరిసరాలు
అందమైన డోలికలే నాలుగు దశాబ్దాలు
సుందరమైన సుఖాల పయనమే అంతా ....
పదిలమైన పదవీ విరమణలతో
చిరునవ్వులు చిందిస్తూ ....
బ్రతుకంతా పండించుకుంటూ ...
జీవన పయనమంతా పూలపడవై ...
అడుగడుగున హారతి పడుతుంటే ....
ఎద కోయిలలై పాడగా ... వసంతాలన్నీ
వాలిపోవా..... ముంగిట ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment