Tuesday, July 12, 2022

కనిపించని రాతలు తేది 09-02-2022 శీర్షిక : రాజకీయ ప్రకటన పత్రాలు

 కనిపించని రాతలు

తేది 09-02-2022
శీర్షిక : రాజకీయ ప్రకటన పత్రాలు 
          (Manifestos ) 
కవిత సంఖ్య : 215

ప్రజలంటే పరాచికాలేనాయే 
పాలకుల దృష్టిలో  నేటి రోజుల్లో ... 
అంచనాలు లేకుండానే అల్లిబిల్లి 
మాటల గారడీలతో అల్లుకుంటున్నాయి  
రాజకీయ ప్రకటన పత్రాలు .... 

ఒడ్డెక్కేదాకా ఒడామల్లప్పలా 
గాలిలో మేడలు కట్టేస్తూ...  
గమ్మత్తుల గజిబిజి గందరగోళాలు 
కుమ్మరిస్తూ ... ఎన్నికలంటేనే  
ఏవగింపుల పర్వంలా  చేస్తున్నరు ... 

సంక్షేమాలతో చక్కదిద్దాల్సిన 
సంఘ సంస్కరణలు కాస్తా ... 
పోటాపోటీగా బహుమతుల 
పందేరాలు... కాగితాలపైన ... 

ఉత్పాదకతల ఉయ్యాలలో 
దేశ సంపదలు సౌభాగ్యాలు 
తులతూగాల్సినది పోయి .... 
సోమరిపోతుల రాజ్యాలుగా 
తీర్చిదిద్దే శూరత్వాల అమలులతో ... 

అధికార పగ్గాలు చేజిక్కగానే 
అందలాలన్నీ సొంతమనే  
భావనాలేనాయే .... అనువైన 
వాగ్దానాలు అమలు చేసుకుంటూ ... 
అసలు ప్రణాళికల రాతలన్నీ 
అటకెక్కిస్తూ ... ఆటవిడుపులే 
ప్రజలన్న పట్టింపులేని  పాలకులకు... 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment