Tuesday, July 12, 2022

ఆత్మ గౌరవం తేది: 20-02-2022 శీర్షిక : ఆత్మాభిమానం

 ఆత్మ గౌరవం

తేది: 20-02-2022
శీర్షిక :  ఆత్మాభిమానం 
కవిత సంఖ్య : 223

అందరూ అన్ని చేయలేకున్నా 
అందరి పనులు అందరికి  గొప్పే ... 
చేతివృత్తులవారంతా కలిస్తేనే 
హాలికుని కార్యక్రమం సులువు ... 

ఎక్కువ తక్కువనుకుంటే 
ఏమున్నది ఎదురుతిరిగుల్లే ....  
ఐదువేళ్ళు కలిసి నిలిస్తేనే 
అందిస్తాయి కమ్మని భోజనం .... 

పాలకుని పాలనలెంత గొప్పనో  
సైనికుని రక్షనంత  గొప్పనే ... 
మనిషైనా ... ప్రాంతమైనా ... 
దేశమైనా .... ప్రతీది సమమే .... 

శిరస్సున ధరించే కిరీటమైనా ... 
కాళ్లకు ధరించే పాదరక్షలైనా ....
అత్యవసరాలు ... అవసరాలు ... 
ఆడంబరాలు ...అన్నీ కలిస్తేనే జీవితం... 

బ్రతుకు జీవన గమనంలో 
బాధ్యతల నిర్వాహణలో 
సిద్ధాంతాలు రాద్ధాంతం కాకుండా .... 
విలువల వలువలు కాపాడుతూ ... 
నిస్పాక్షికంగా నిలబడే వ్యక్తిత్వం .... 

అనంత జీవరాశిలో రాగద్వేషాలు 
మానవాళికి మాత్రమే స్వంతం .... 
రెండు రెక్కల్లాంటి  రాగద్వేషాలు  
బలపడితే ... మనసు గతి తప్పు ... 

బంధాలలో చిక్కితే బద్దుడు 
బంధ విముక్తుడైతే బుద్ధుడు .... 
బంధానికైనా .. మోక్షానికైనా 
మనసే కారణం ... మూలం ..... 

స్వార్థాల జోలెలు నింపుకోకుండా 
బంధాల బంధుప్రీతి చూపకుండా 
తమ పర భేదమెరుగని నిశ్పాక్షికత్వం ...
లాభ నష్టాల బేరీజు లేని స్థితప్రజ్ఞత్వం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment