ప్రత్యేక కవిత
తేది:05-02-2022
శీర్షిక : సమతా మూర్తి
కవిత సంఖ్య : 840
కనరండి కనరండీ
కనులన్నీ పండగా ...
కారణ జన్ముడయిన
కారుణ్యమూర్తి పండగ .....
సమస్త మానవాళి
సర్వం ఒక్కటేనన్న
సమతామూర్తికి మనమంతా
సమర్పించి పూజించే
సహస్రాబ్ది ఉత్సవం ....
అష్టాక్షరీ మంత్రాన్ని
అందరికుపదేశించి
మనుషులంతా ఒక్కటేనని
మనసారా నమ్మినాఁడు ....
వేదార్థ సంగ్రహాలను
భాష్యాలను రచియించి
గద్యాలను గమనపరిచి
గతులను నేర్పిన యతిరాజు ....
విష్ణుమూర్తి అంశగా
ఆదిశేషుడే అవతరించె ....
విశిష్టాద్వైతమును
విఖ్యాతమొనర్చగా .....
ముచ్చింతల్ కేంద్రంగా
విశ్వమంతా వీక్షించగా
యతిరాజుకు మనమిచ్చే
ఘనమైన నివాళులతో .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment