Tuesday, July 12, 2022

తరుణ వయస్సు తేది: 22-02-2022 శీర్షిక : సంధి సమయం ...

 తరుణ వయస్సు

తేది: 22-02-2022
శీర్షిక :  సంధి సమయం .... 
కవిత సంఖ్య: 854

అలకలన్నీ మానేసి అప్పుడప్పుడే 
ఆలోచనలు చుట్టుముడతాయి... 
శారీరక మార్పులకు శరము 
సంధించినట్టు కళ్ళల్లో బెరుకులు ..... 

కలలు ... కలవరింతలు 
చుట్టుముట్టి...కకావికలాలకు ... 
మనసును ఆయత్తం చేస్తాయి .... 
సరైన మార్గదర్శనం  కోరే సంధి కాలం .... 

సరిగ్గా ఆ సమయాన్నే  
అవపోశన పట్టగలిగేతే.. 
ఎదురుచూడని వెలకట్టలేని 
గురువు ఎదురైతే...అంతా సవ్యమే ..... 

పారిశ్రామిక వేగాలకు 
అవిభాజ్య కుటుంబాల 
ఆలనలు  కరువై ... ఎవరికీ 
వారే ... యమునా తీరే చందమై .... 

తీరుబడిలేని సంపాదనలకై 
ఉరుకులు పరుగులు పెట్టే 
అమ్మానాన్నల గడియారంలో 
పిల్లల పెంపకాల అనుభవాల 
శూన్యతలు ..... 

ముందు వెనకల ఆలోచనలు 
కరువైన  తరుణ వయస్సు.... 
గాలి వాటంగా వంపు తిరిగితే 
చెడు సావాసాలు చేరదీస్తే .... 

సాంకేతికతల సవ్వడిలో యువత 
నెట్టింట్లో బందీ అయిపోతే ...  
కన్నవారి కలలన్నీ కరిగిపోయి 
గాలివానకు రాబందులు తోడైనట్లే ..... 

స్వీయ క్రమశిక్షణలు పాటిస్తూ 
ఆత్మీయతానురాగాలతో  అలరిస్తూ ...  
పని ఒత్తిడిలో సైతం .... పట్టింపులతో 
తల్లిదండ్రులు పిల్లలకు మంచి 
స్నేహితులై ... ఉదాహరణలకు 
ఊతమై నిలిచి .... బాగోగులను 
పర్యవేక్షించుకోవాలి .....సమయానుకూల 
మార్గదర్శనం చేస్తూ...... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment