Tuesday, July 12, 2022

గాంధర్వ గానం తేది 11-02-2022 శీర్షిక : ఘంటసాల గారి స్మృతిలో

  గాంధర్వ గానం

తేది 11-02-2022
శీర్షిక : ఘంటసాల గారి స్మృతిలో 
కవిత సంఖ్య :   845

కట్టూ బొట్టూ కలబోసిన రూపం 
ఆహార్యంలో అచ్చ తెలుగుదనం 
అలవోకగా పల్లవి చరణాలను 
పలికించిన... గమకం సంగతులు
నిండిన కంఠంలో గాంభీర్యం ..... 

రాగాల పంట ఘంటశాల పాట  
ఎంత పాతదైనా ఏలికనే ... నేటికీ 
గాంభీర్య  స్వరముతో తాను 
గాన మెత్తితే రోమాంచితమే .... 

తెలుగు వారి కొరకై ప్రాణాలర్పించిన 
పొట్టిశ్రీరాములును గాంచి 
పొగిలి పొగిలి ఏడ్చి... ఆశువుగా 
ఎత్తుకునే ఆంధ్రులకై గీతాన్ని .... 

వెండి తెరల జాడల్లో 
వెలుగులీని నడయాడే  ..
తెలుగు లోగిళ్ళలో తెర తీసి 
ఎదురొచ్చు వేంకటేశ్వరుడు 
నడిచొచ్చు కాళహస్తీశ్వరుడు .... 

బహుళ ప్రచారమాయె భగవద్గీత 
బంగారమోలే జనసంద్రంలో 
అజరామర కంఠములో అమరి 
అమరమై నిలిచె ఎప్పటికీ .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment