ప్రయాణం
తేది : 19-02-2022
శీర్షిక : పయనం…
కవిత సంఖ్య : 222
చదనుగుందని కొంతమంది
గుండ్రంగుందని కొంతమంది
వింత వింత విజ్ఞానాల
విరివైన ప్రదర్శనలుండె…. ఒకప్పుడు..
శూన్యంలో విలసిల్లినా
సుందరమై శోభించే అవని…
మరకతమై మనసు దోచు
మది మందిరమై వెలుగులీను
పలురకాల సంపదలతో ....
తిరిగి తిరిగి దినకరుడు
తిన్నగా కనపడు తూర్పున
తానే పరిభ్రమిస్తున్నాడేమోనన్న
భ్రమలు మనకు కల్పిస్తూ .......
తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుణ్ణి కూడా చుట్టేస్తూ ధరణి మాత
రోజులు సంవత్సరాలు గడిపేస్తూ
నిరంతర పయనమైనా సరే ...
నిత్య నూతనమైన చైతన్యమే ....
పాలపుంతలలో పదిలమైన
పదులకొద్ది సముదాయాలలో…
లక్షలకొద్దీ నక్షత్ర రాసులెన్నున్నా
కక్ష్యలలోనే కదులుతుంటాయి…
జతలకొద్దీ గ్రహాలెన్నో ఉన్నా
గతులు తప్పని పయనమే….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment