నిలువనీయనీ
తేది: 18-02-22
శీర్షిక: మంచి చెడుల మర్మమెరుగ
కవిత సంఖ్య: 851
వెలుతురుకన్నా వేగమాయె
మనిషి లెక్కించలేని మనోవేగం
కాలం కన్నా కష్టమాయె
నొప్పించినా .. నవ్వించినా ..
అనుక్షణం అనుసరించే
మార్పుల మాయజగత్తులో
పరుగులెత్తే ప్రకృతినీడలో
నిలువనీయనీ నన్ను నిలకడగా ...
జీవితమంటే క్షణభంగురమేనని..
నీటిబుడగలాంటిదని.. ఉవాచలేనాయే
అయినా ఆగని పరుగులేనా ..
అప్పుడప్పుడైనా ఆశల తృప్తి లేదా….
ఆరాటాల పోరాటాలే
ఈర్ష్యా ద్వేషాలే అనునిత్యం..
చెడు చెంగున దూకినా
అంటనీయకు చేరనీయకు ....
వారెల్లారని వీరు...వీరెళ్లారని వారు..
గమ్యాలేర్పరుచుకోక గమనాలేమిటి...
మంచి చెడుల మర్మమెరుగ
మననం చేసుకొనీ ... వ్యవధినివ్వు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment