Tuesday, July 12, 2022

శుక్రవారం తేది: 18-02-22 శీర్షిక : లక్ష్మీ సంకేతం

 శుక్రవారం

తేది: 18-02-22
శీర్షిక : లక్ష్మీ సంకేతం 
కవిత సంఖ్య : 220

అన్ని మతాలవారికి అపురూపమే 
అయినా అత్యంత ప్రీతిపాత్రం 
అమ్మను కొలువంగఁ హిందువులకు 
లక్ష్మీ వారమని ప్రసిద్ధి ప్రజలకు ..... 

వారంలో వంతుగా ఆరయినా 
వరుసగా పూజింతురు లక్ష్మీదేవిని 
లలితా దేవిని సంతోషిమాతను....  
మానవ మాత్రులైన మాతలంతా 
ఎంతో భక్తిగా  మన దేశాన ...... 

అష్టలక్ష్ములకు సమానమని 
అతివలంతా కొలుతురు అమ్మను 
వరలక్ష్మీ రూపంగా  వ్రతమాచరించి 
విశిష్టాల విరిజల్లని .. శ్రావణంలో 
వాయనములిచ్చుకుందురు 
ముతైదువలంతా  మురిపంగా... 

శుచి శుభ్రతల చిహ్నం 
సత్యం ధర్మం కాణాచి 
లోకమంతా ఒక్కటైనా .... 
అమ్మ ఉంటే  అంతే చాలు .... 
అమ్ముంటే అన్నీ ఉన్నట్టే 

కొబ్బరికాయలు  కొట్టాలన్నా  
ముహూర్తం షాట్ పట్టాలన్నా  
కొత్త బొమ్మను వదలాలన్నా 
సినిమా వాళ్లకయితే సిరి గల రోజు 
లక్కు కల్సిరావలనే లక్ష్మీ సంకేతం ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment