ప్రపంచం ప్రయాణం ఎటు ...
తేది : 17-02-2022
శీర్షిక : పొరుగును ప్రేమించు
కవిత సంఖ్య : 850
సూర్యుడు తూర్పున ఉదయించినా...
చంద్రుడు పశ్చిమాన కనిపించినా.....
అంతా మాయేననేది నిత్యం ....
భూమి తిరుగుతుందనేది సత్యం
ఇతరులకంత సులువుగా
అర్థం కాకపోయినా ....
ఇగురమైన ప్రయాణమే
క్రమశిక్షణల కక్ష్యలో.... భూమిది
ఆధారమైన ప్రత్యేక్ష సాక్ష్యాలు
అగుపించక పోయినా ....
శూన్యంలో శుభ్రంగా తిరుగు
గురుత్వాకర్షణల శక్తి గుంభనమై ....
విశ్వమంటే గ్రహాలే కాదు
వింతగా...జీవరాశి..మానవాళి అనుకుంటే ....
ఆలోచనలేమో అంతరిక్షం పైన
నడవడికలేమో అధఃపాతాళం వైపు ....
మతాల సారమంతా ఒకటేనంటూ
మర్మాలను బోధిస్తూనే ....
స్వార్థాలను సంకనేసుకుని
మారణహోమాలకు ముహూర్తాలు ....
పారిశ్రామిక ప్రగతిలో
సాంకేతికతల సొబగులతో
పరుగులు పెడుతూనే ....
ప్రపంచీకరణ.. సరళీకరణలని
పల్లవులనెత్తుకున్నా ....
విశ్వ పాలకుల మనసులు మాత్రం
వింతగా మొరాయిస్తూనే ఉన్నాయి .....
యుద్దాలు ... తంత్రాలు ... వద్దంటూనే
పర్యావరణ పదిలాలను మరిచారు ....
ఎంతమంది ఎటు తిరిగినా ...
తిరిగి తిరిగి తీరానికి చేరావాల్సిందే ...
మహర్షుల మహాత్యాల వెలసిన
యుగాలనాటి సంప్రదాయాలే
శరణమయి నిలవాల్సిందే .....
అహింస ఆయుధంగా
పొరుగును ప్రేమించే తత్వం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment