ప్రియమైన నీకు
తేది : 14-02-2022
శీర్షిక : ప్రేమ పత్రం …
కవిత సంఖ్య : 847
తొలి చూపుల తోరమో ...
చిరునవ్వుల మాయలో ....
కంటి రెటీనాలో వెలిసావు…
మాటి మాటికీ నీ రూపాన్ని
మనసు తెరమీద చిత్రిస్తూ
మనసంతా నిండిపోయావు .....
నాటుకున్న ప్రేమ మొక్క
నందనవనమై వర్దిల్లగా
పెదవి దాటని ప్రేమ కబుర్లెన్నో
పరిమళాలు వెదజల్లుతుంటే ...
మదిలో మెదిలిన తొలి ప్రేమల
తీపి గుర్తులను బంధించే ప్రయత్నం ....
క్షణమొక యుగంగా దొర్లుతుంటే
గడ్డుకాలమని సర్దిచెప్పుకోలేక
మననం చేసుకుంటున్నా
తేనెలూరించే తీపి కబుర్ల
మధుర క్షణాలను పదే పదే ....
అక్షరాలలో బంధించి నా
ఆరాటం తెలపాలనుకుంటున్నా ....
అందుకే ప్రియమైన నీకంటూ
కలమెత్తుకుంటున్నాను… గళంలో
నిలిచిపోయిన కబుర్లన్నీ వంపేసి
శ్వేత పత్రమంతా నింపేసి …
ప్రేమ పత్రంగా సంధిస్తా …
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment