Tuesday, July 12, 2022

పుస్తక నేస్తం తేదీ : 16-11-2021 శీర్షిక : నేటికీ కొంత సౌకర్యం ...

 పుస్తక నేస్తం

తేదీ : 16-11-2021
శీర్షిక :  నేటికీ కొంత సౌకర్యం ... 
కవిత సంఖ్య : 69+7

శ్రీ కృష్ణ తులాభారంలో 
తులసీ దళంలా ....విశిష్టతలెన్నో 
మూటగట్టుకున్న ముగ్ద 
మనోహర మూర్తిమత్వం .... 

మొగ్గలుగా ముడుచుకున్నా ... 
పూవులుగా విచ్చుకున్నా…..
పరిమళాలు వెదజల్లే  సుమాల్లా 
జ్ఞాన భాండాగారాలను మోసుకొచ్చే 
మానసిక  వికాసాల జ్యోతులు .... 

గత కాలపు జ్ఞాపకాల నిక్షిప్తతలతో …
భూత కాల విజ్ఞానాలను జోడిస్తూ …
భవిష్యత్ తరాల గమనాలకు 
మార్గదర్శిగా దివిటీలౌతావు .... 

భావ ప్రకంపనలను బందీ 
చేసుకుని ... మేధో మదనాలకు 
చోటిచ్చి .... అనువంతున్నా …
అణుబాంబులను పేల్చగలిగే 
అపర కాళికవు .... 

శాస్త్రీయమైనా....ఆధ్యాత్మికమైనా …
అంతరంగాలను సృషిస్తూ… 
జీవరాశి నుండి మానవాళిని 
ప్రత్యేకంగా నిలబెట్టిన ధీశాలివి .... 

సాంకేతికత సంతరించుకుని 
సంక్షిప్తమై చరవాణిలో నిక్షిప్తమై
కొంత దూరమయినా ....పుస్తకమే 
పఠనానికి ... అన్ని వయసుల 
వారికి  నేటికీ కొంత సౌకర్యం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment