Tuesday, July 12, 2022

రథసప్తమి తేది: 07-02-2022 శీర్షిక : రవి జయంతి

 రథసప్తమి 

తేది: 07-02-2022
శీర్షిక : రవి జయంతి 
కవిత సంఖ్య : 841

సనాతనమైనా ... సాంప్రదాయమైనా 
సశాస్త్రీయ విజ్ఞానమే మన భారతాన .... 
చెట్టును కొలిచినా పుట్టను కొలిచినా 
పూరెమ్మనైనా ... సూర్య రశ్మినైనా .... 
విటమిన్  డి  నిచ్చే దివ్య ఔషధమై  ..... 

కాల నిర్ణయాలకు కారణభూతమై .... 
జీవ విధానాలకు తోడై నిలిచిన  .... 
పాలపుంతలోని ప్రధాన నక్షత్రం
ఫరిడవిల్లే జీవరాశికి తోడునీడగా ....
ప్రత్యక్షంగా వీక్షించే సూర్యభగవానుడు ....  

పత్రహరితాలకు ప్రాణకోటియై 
అవని శోభలను ఇనుమడిస్తూ 
పచ్చ తివాచీలు పరుస్తూ.. ఎల్లవేళలా 
జీవరాశి మేలు కోరే ప్రకృతి ... 
పంచభూతములలో ... ప్రత్యక్ష 
దైవమయిన ..దివాకరునికి నమస్తుభ్యం..... 

దినకరుని ఉత్తరాయణ పయనంలో 
మాఘశుద్ధ సప్తమి రోజు పవిత్రమని  
పారేటి నీటి నదీ  స్నాన జప తపాదులు 
సర్వ శ్రేష్ఠమని... భానుని పూజలెంతో 
భవ్యమని తెలిపె...భవిష్యోత్తర పురాణం...   

ఉత్తరాయణ పయన ప్రారంభమని 
ఏడువారాల సంకేతంగా సప్తాశ్వ రథ  
మారూఢుడై .. పన్నెండు రాశులను 
పలకరిస్తూ పరిపూర్ణ పయనమే సంవత్సరకాలం  ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment