Saturday, July 2, 2022

అంశం : మాటల వంతెన తేది: 04-02-2022 శీర్షిక: పరిమళాలు వెదజల్లాలి ....

 సమూహ సంఖ్య : 41

అంశం : మాటల వంతెన
తేది: 04-02-2022
శీర్షిక: పరిమళాలు వెదజల్లాలి .... 
కవిత సంఖ్య : 839

మాటల తోటలో విహరిస్తుంటే  
మల్లెల పరిమళాలు వెదజల్లాలి ... 
మానవత్వాలు కలిసి  జతకట్టాలి .... 
మధోరోహలతో మైమరిపించాలి ..... 

మాటల తీరుతోనే ... మానవత్వాల 
వంతెనలు నిర్మించుకోవచ్చు .... లేదా 
మానవాళిని విచ్చిన్నం చేసే మంత్రము 
జపించవచ్చు ... మాట మారణాయుధాల 
యంత్రము కన్నా పదునైన తూటా  ..... 

మాటల మర్మం తెలియాలంటే 
మననం చేసుకోవాల్సిందే... 
మనమంతా మరోసారి రామయ్యను 
యుగం మారినా జగం మరవని బాట .... 

మాటయినా ... మాటాపలికే 
మనిషయినా అన్నీ కాల మహిమలే ..... 
మేకతోలు కప్పుకున్న పులులే  అన్నీ.... 
కలియుగంలో మనకు తారసపడే  జీవులు  .... 

ఇక రంకు నేర్చిన రాజకీయంలోనైతే .... 
బొంకి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం .... 
మానవాళికి పట్టిన ఏలినాటి శని .... 
మనమే తెలుసుకోవాలి ....హుషారుగా .... 
మనమే మసలుకోవాలి... అతి జాగ్రత్తగా ...  

ఐక్యతా రాగాల వల్లింపులకోసం 
మనమంతా  సత్వరమే పూనుకోవాలి .... 
మాటల వంతెనలు  బీటలు వారకుండా 
మనవత్వాల మట్టి వాసనలు శ్వాసించాలి ... 
అనుబంధాలతో అంటుకట్టాలి .... 
ఆత్మీయతలతో పూయించాలి ... 

నగునూరి రాజన్న 
కరినగరము 


No comments:

Post a Comment