భీష్మ ఏకాదశి
తేది : 12-02-2022
శీర్షిక: విష్ణు సహస్రనామ జయంతి…
కవిత సంఖ్య : 216
అష్టవసువుల్లో అతడొక పుణ్యమూర్తి
తండ్రి కొరకు..ఆనందాలను తాకట్టు
పెట్టిన తనయుడు భీష్మ పితామహుడు.
తండ్రిచేత ఐచ్చిక మరణ వరప్రసాది ...
ఆయధం పట్టనన్న అనంతున్ని
సైతం.. తన ప్రతిభా పాటవంతో
ప్రతిజ్ఞా వ్రత భంగానికి
ప్రేరేపించిన గొప్ప పరాక్రమశాలి..
శిఖండినడ్డం పెట్టుకున్న పోరుకు
అస్త్రసన్యాసంతో శరతల్ప గతుడైన
భీష్ముడు..ఉత్తరాయణ పుణ్యకాలంలో
మాఘశుద్ధ ఏకాదశిన మరణంకై
నిశ్చయించుకునె....
స్వజనుల శవాల గుట్టలమీద
సాధించిన విజయం మనశ్శాంతినివ్వక..
మనో క్లేశములను బాపుమని.. ధర్మజుడు
సోదరులతోడ కృష్ణుడితో కల్సి శాంతనవుని
శరణు జొచ్చె.....
అంత భీష్ముడు చిరునవ్వుతో ...
ప్రశ్నలన్నింటికీ పరంధాముడే
సమాధానమంటూ.. సంధించే
సహస్రనామావళి విష్ణువుపై
సంశయాలన్నీ తీర్చ సంతసంబై....
సర్వదుఃఖ హరణమని సకల
శుభాలతోరణమని సన్నుతించె…
దివ్యనామావళిలో ప్రతి అక్షరం
పరమ పావనమని ప్రబోధించే…
విష్ణు సహస్రనామమంటు వివరించె…
నేటికిని అజరామరమే ఆనందమే….
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment