లతా మంగేష్కర్
తేదీ : 06-02-2022
కవిత సంఖ్య : 96+4
మరాఠా మధుర గాన కోకిల
మూగ పోయేనా మౌనంగా ఈవేళ ...
పిన్న వయసులోనే నాన్నఎడబాటుతో
పిడుగు లాంటి బాధ్యత భుజాలపై
పడింది .....
అక్షరాల తోవను ఆవలకు నెట్టి
పాటనే ప్రాణ సమంగా ప్రేమించి
ఇరవై భాషల్లో అరవై వేల పాటలతో
విరబూసింది పరిమళాలు వెదజల్లి ....
పాటల తోటలో పల్లవించిన నైటింగేల్
సంగీత ప్రపంచంలో ఆకాశమే హద్దుగా
సినీరంగాన్ని చిత్రంగా శ్వాశించి
అదే లోకంగా జీవించారు లతగారు .....
కఠిన పాషాణాలకు సైతం
కన్నీరు తెప్పించారు పాటతో .....
ఎనబదేండ్ల గాన ప్రపంచంలో
ఎన్నెన్నో గొప్ప గొప్ప పాటలు ....
లెక్కలేనన్ని అవార్డులతో
లెక్కకు మించిన సత్కారాలతో
భారత రత్న , పద్మవిభూషణ్ మరియు
జీవితకాల సాఫల్యతలతో కీర్తింపబడ్డారు ....
తీరైన కట్టూ బొట్టుతో
నిండైన భారతీయతల
నిలువెత్తు విగ్రహం .....
భారత సినీ రంగానికి తీరని లోటు
దక్కని గాన కోకిల మాధుర్యం ...
సంగీత గాన కచేరీలేమైనా
స్వర్గంలో పురమాయించారా ....
అనుకున్నట్టుగా అందరూ
వరసబెట్టి పయనమౌతున్నారేంటో ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment