Tuesday, July 12, 2022

మేడారం తేది : 17-02-2022 శీర్షిక : వన దేవతలు

 మేడారం 

తేది : 17-02-2022
శీర్షిక : వన దేవతలు 
కవిత సంఖ్య : 219

పచ్చని ప్రకృతి నెచ్చెలుల మధ్య 
ఏడు విడిచి ఏడు పండగ 
ఎదలన్నీ పొంగి పొర్లాగా 
ఊరువాడా బైలెల్లె మేడారం జాతర .... 

ఆసియాలోనే అతిపెద్ద జాతర 
అడివి తల్లి బిడ్డలు జరుపుకునే 
అరుదైన ఆచారాల పండగ  
సమ్మక్క సారలమ్మ జాతర ..... 

అడివంతా ఆధ్యాత్మికకేంద్రమై 
చెట్టు చేమలన్నీ పుట్టతేనెలాయే 
అలనాడు పోరాడిన అక్కాచెల్లెళ్ల  
పేరన .. అపూర్వమైన మాఘపౌర్ణమి ....  

వేదమంత్రాలు లేవన్న 
వేదనలు వలదు .... వేవేల 
జనుల నోట నామ స్మరణలే 
తీరొక్క మంత్రమై నిలుచు .... 

జంపన్న వాగులో జనమంతా 
స్నానమాచరించి భక్తి ప్రపత్తులతో 
అమ్మవార్లకు మొక్కి అప్పగించెదరు 
ఎత్తు బంగారం .... ఏటపోతులను ... 
భక్తి పారగా శక్తి దేవతలుగా ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment