చిత్ర కవిత
తేది: 04-02-2022
కవిత సంఖ్య : 96+2
శీర్షిక : ఛత్రపతి
పూవు పుట్టగానే పరిమళించినట్లు
బాల్యం నుండే మాతృభూమిపై
బంగారు కలలు పండించుకున్న
భవానీ మాత వరపుత్రుడు ....
ఎక్కడ నెగ్గాలో ... ఎక్కడ తగ్గాలో ...
యుక్తాయుక్తాలు ఎరిగిన యువకిశోరం ...
సాదా జీవనాన్నే సదా కోరుకుని ....
ప్రజలే సర్వస్వమని భావించేవాడు ....
అమ్మ మాటకు హారతులు పట్టి
అమ్మ భవానీ మాత ఖడ్గం పొందిన
అద్వితీయ పరాక్రమవంతుడు ....
శత్రు సైనికులకు సదా సింహ స్వప్నమే ....
రామాయణ భారతాలను రంగరించుకుని
రమణీయతలను మూటగట్టుకున్న
రసరమ్య హిందూ సామ్రాజ్యవాది ....
యుక్తవయసునుండే అమలు పరిచాడు ....
అనేక రకాల యుద్ధ తంత్రాలలో
ఆరితేరడమే కాకుండా ....పటిష్టమైన
గూఢచార వ్యవస్థలతో ....ప్రజా పాలనలలో
పట్టుకలిగి ... ప్రజలకొరకే ప్రభుత్వాలుండాలన్ న
బహు గొప్ప పాలకుడు .....
భారతీయ చరిత్ర పుటలలో
బహుగొప్పగా వెలుగొందిన
అతికొద్ది మంది రాజులలో
అమరుడై పేరొందిన ఛత్రపతి .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment