Tuesday, July 12, 2022

వసంత పంచమి శీర్షిక : అక్షర రూపం తేది: 05-02-2022

 వసంత పంచమి 

శీర్షిక : అక్షర రూపం 
తేది: 05-02-2022
కవిత సంఖ్య : 96+3

అమ్మ రూపమే అక్షరం  
నాన్న రూపమే విజ్ఞానం 
గురువు రూపమే విచక్షణం 
మూడు కలబోస్తే  సరస్వతం 
అక్కున చేర్చుకుంటే సమున్నతం .... 

అమలు పరిస్తే అద్భుతం ... 
వాక్కునొసంగె తల్లి వాగ్దేవి 
వీణాపాణి విమలస్వరూపిణి 
విజయములీవే చదువులనోసిగి ... 

బుద్ధిర్బలముల నొసగి 
విద్యా వివేకములనుడివి 
సజ్జన సాంగత్యముల నివ్వవే 
నీరదేందు ఘనసార హంసవాహిని ..... 

కల్లా కపటం లేని జీవితమిచ్చి 
కళల విజ్ఞాముల నోసిగి 
కాచి మమ్ము కరుణించు మాత 
కచ్ఛపి ధారి కరుణా మూర్తి ...... 

షోడశ కళల తల్లివి నీవు 
అన్నీ ఇచ్చి అణుకువ నేర్పి 
సర్వ వేళలా సన్నుతించవే 
సరస్వతీ మాతా సదా మొక్కెద ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment