Tuesday, July 12, 2022

చిత్రకవిత తేది: 18-02-22 శీర్షిక : కమల బాలలు

 చిత్రకవిత

తేది: 18-02-22
శీర్షిక : కమల బాలలు 
కవిత సంఖ్య : 96+10

అరమరికలెరుగని ఆబాలగోపాలం 
అందుకున్నరు దుత్తి నిండా పూలు 
అరుణ వర్ణములో విచ్చుకున్న 
అందమైన కమల కోమలములను  ...... 

పూజకు వేలాయనంటూ పూబాలలు 
పూల తటాకమున  నీట దిగి పాటిగా 
తూడుతో సహా పూలు కోసే పనిలో మునిగే .... 
తామరలను .... సభక్తితో సమర్పించ ..... 

మతాల మర్మమంతా ఒక్కటే 
భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించ .... 
నవవిధములలో నమ్మకమైనది 
తనువు మనసు సమర్పించడం ...... 

వారంలో ఆరవ రోజుగా వాసికెక్కె 
శుక్రవారము మిగుల చక్కనని 
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమై... అతివలంతా కలిసి 
ఆదరముగ పూజించు అగ్రభాగమై ..... 

శుచికి శుభ్రతకు మారుపేరై 
లక్ష్మీదేవికి మిగుల శ్రేష్ఠమని 
శుక్రవారము విలసిల్లె శోభాయమానమై 
మగువలంతా కొలుచు మనసై ....                 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment