Tuesday, July 12, 2022

గాలినై పోతాను గగనానికి .. తేది : 08-02-2022 శీర్షిక : గాలినై గగనానికి చేరే వేళ...

 గాలినై పోతాను గగనానికి ..

తేది : 08-02-2022
శీర్షిక : గాలినై గగనానికి చేరే వేళ... 
కవిత సంఖ్య : 842

చీకటి వెలుగుల సంగమంలా 
యుగ యుగాలుగా ... అన్యాయం 
ప్రబలినప్పుడల్లా .... అధర్మం
అతిక్రమించినప్పుడల్లా.... 
ధర్మ సంస్థాపనార్థంగా  
దైవం మానుషరూపేణ అవతరించి 
నడయాడిన పుణ్యభూమి నా దేశం .... 

తపో సంపన్నుల తండ్లాటలతో 
మహా ఋషుల త్యాగాలతో 
వేద వేదాంగాలకు నిలయమై
పురాణ ఇతిహాసాలకు పుట్టిల్లై  
ఉపనిషత్తులు కావ్యాలకు ఆలవాలమై 
సనాతన సాంప్రదాయాలతో పునీతం  .... 
పుణ్యభూమి నా మాతృదేశం  .... 

లెక్కలేనన్ని గొప్ప దేవాలయాలతో ...
పుణ్య చరితల జీవనదులతో పునీతమై....  
పచ్చలారబోసుకున్న మైదానాలు 
పునీతమైన కొండా కోనా వాగు వంకా... 
ఉత్తరాన హిమాలయాలతో ... దక్షిణాన 
సముద్రాలతో .... అణువణువు అమృతాన్ని 
పుణికి పుచ్చుకుని  చిలకరించింది  ..... 
పుణ్యభూమి నా మాతృ దేశం ... 

తరతరాలుగా మాతృభూమి సేవలో 
పునీతమైన యోధులతో ప్రజ్వరిల్లి 
పరిమళాలు వెదజల్లుతున్న 
పర్యావరణ సుగంధాల గాలులతో .... 
పవిత్రమైన నా మాతృభూమి గడ్డపై 
జననమే ఒక మరుపురాని మధురస్మృతి ... 

అవకాశమొస్తే అందుకోనా 
ఉడతాభక్తిగా సాయమందించ 
ఉన్న ఊరికి ... కన్నవారికి 
కీర్తిప్రతిష్టలందించ... ముందు తరం 
వారి బాటలో ... ముదము గొల్పు రీతిలో 
గాలినై గగనానికి చేరే వేళ .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment