Tuesday, July 12, 2022

అవును పిలవాలనే ఉంది .... శీర్షిక : మానవత్వపు జాడలను ..... 06-02-22

 అవును పిలవాలనే  ఉంది .... 

శీర్షిక : మానవత్వపు జాడలను ..... 
తేది : 06-02-2022
కవిత సంఖ్య : 212

యుగాల మాటేమో గాని .... 
దశాబ్దాల చరిత చాలు .... 
మానవాళి స్వార్థ చింతనలకు  
మననం చేసుకుంటే .. మచ్చు తునకలు ...... 

నిజం నిప్పులాంటిదనీ విన్నాం ... 
కళ్లారా చూసినవాళ్లున్నారు ... 
చెవులారా విన్న వాళ్ళున్నారు ... 
అయినా మారని మనిషి తత్వం  ... 

వలసలెందుకోచ్చాయో చూస్తుంటే  ... 
వరసబెట్టి ... ఇంటోడే దొంగల్లో 
దూరిన దాఖాలాలెన్నో .....అయినా ...  
వద్దని వారించని మనస్సాక్షులే .... 

అప్పుడు కాకపోతే ... ఇప్ప్పుడు 
ఆలస్యంగానైనా... అలుసులన్నీ 
తెలుస్తూనే ఉన్నాయి ...... 
ఎలుగెత్తి చాటి ... ఎదురెళ్లి పిలిచి 
ఏదైనా చేయాలనిపిస్తుంది .... 

స్వాతంత్రంకు ముందు కొంత ... 
తర్వాత కొంత .... తప్పుతోవల 
చరిత్రలన్నీ చదివించినందుకు ... 
తట్టి లేపాలనే ఉంది మానవత్వాన్ని ..... 

కోట్ల ఉదాహరణలు కొట్టిన పిండే .... 
తనువు దాటి తందనాలాడుతుంటే 
తూటు పైసను కూడా దాటించలేవని. ..  
అయినా తీరని వ్యామోహాలే ..... 
మొట్టికాయ కొట్టయినా చెప్పాలనుంది ... 

వాళ్ళని ... వీళ్ళు .... వీళ్ళని .... వాళ్ళు .... 
అంతేగాని .... నేనేంటని  ప్రశ్నిచుకోలేని 
నిస్సిగ్గుల వ్యవహారాలే అన్నీ ..... 
అందుకే .. గొంతెత్తి పిలవాలనుంది 
మానవత్వపు జాడలను ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment