Tuesday, July 12, 2022

అభినందనలు తేది : 09-02-2022 శీర్షిక : అసలు సిసలు…

 అభినందనలు

తేది : 09-02-2022
శీర్షిక : అసలు సిసలు… 
కవిత సంఖ్య: 96+6

కరతాళ ధ్వనులన్నీ కలగలిసి 
కర్ణామృతమై గోచరిస్తున్నవి ... 
మనసు పరిమళాలను వెదజల్లి 
మనుషులను కట్టిపడేసినవేమో ..... 

ఆత్మీయతల తోటలలో  హర్షిస్తూ 
అనుబంధాల పందిరిలో విహరిస్తూ 
అనురాగాల వెల్లువలు కురిపిస్తూ 
ఆకస్మిక వర్షమై వ్యక్తపరుస్తున్నాయి ... 
సహజ సుందరమైన సమర్థనీయమై  .... 

నలుగురి కొరకై నీడలా 
వెన్నంటిన నజరానాలేమో ... 
సమాజ శ్రేయస్సును 
శిరసు కెత్తుకున్న మార్గదర్శులో ....   

స్వచ్ఛమైన పాలలా 
సహజమైన తేనెలా 
మెప్పులన్నీ గొప్పలే 
ఒకప్పుడు .... 
 
కలి కాలమో ... కాల మహిమలో  ...
కాసులకో ... తిరకాసులకో ....  
కపట నాటకాలకు తెరలు తీస్తూ 
కనువిందులు చేస్తున్నాయి ... 
కరద్వయాలు... నేటి రోజుల్లో .... 

సత్యం సర్వ పర్యవేక్షణలో 
ధర్మం నాలుగై నడయాడాలని 
అసలు సిసలైన వినయ విధేయతలకే 
పట్టం కట్టగలగాలని మనసారా 
కోరుకుందాం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment