ప్రత్యేక కవిత
తేది: 19-02-2022
శీర్షిక :
ఛత్రపతి శివాజీ
కవిత సంఖ్య : 221
బాల్యంలో పుట్టినింటా
పెళ్లాయ్యాక మెట్టినింటా
వలసవాదుల పాలనలపై
వత్తాసుల సాకులు విని విని ....
విసిగి విసిగి జిజాబాయి
వీరమాతే అయ్యింది
శివై పార్వతి ఇష్టదైవం పేరునే
శివాజీగా నామకరణం చేసింది...
ఆది గురువు అమ్మై నిలవగా
అమ్మ ఆలోచనల అంకురమై
అవపోశన పట్టాడు భారత
రామాయణాలను బహు శ్రద్దగా ....
వీరత్వం రంగరించె విరివిగ
బాల్యము నుండే శివాజీకి
వీరమాతయై ... భవానీ మాత
కరుణించే ఖడ్గమిచ్చి కాలుదువ్వ ....
విభిన్న యుద్ధ రీతుల
విశిష్టతలన్నీ వడకాచిన
వీర శివాజీగా పేరు గడించే
మెరుపు దాడులన్నా ... గెరిల్లా
యుద్దమైనా సన్నద్ధమే సదా ....
వందల యుద్దాలు చేసి
వరుస విజయాలను సాధించె ...
సంద్రపు అలల వలె... పడినా లేచి
పైకెగసి... విజయాలనే మూట
కట్టుకున్నాడు ......
పరాయి పాలకులతో పట్టింపులున్నా
పరమత ప్రముఖులే తన అధికారులు ....
ప్రజలను కంటికి రెప్పలా పాలించి
పరమత సహనం ప్రదర్శించిన
పరమ విజ్ఞుడు .... ప్రజ్ఞాశాలి...
No comments:
Post a Comment