Tuesday, July 12, 2022

సంక్రాంతి గేయం తేది: 15-01-22 శీర్షిక : వరుస సంబరాలు

 సంక్రాంతి  గేయం 

తేది: 15-01-22
శీర్షిక :  వరుస సంబరాలు 
కవిత సంఖ్య : 823

వచ్చింది వచ్చింది 
సంక్రాంతి వచ్చింది 
వరసబెట్టి సంబరాలు 
తేనియలా తెచ్చింది 

1. దినకరుని గమనంలో 
ఆయనం మార్చుకుని 
అరుదెంచే సంక్రమణం  
అందంగా అమిరింది .....  // వ // 

2. ఎవుసంతో  ఎదిగిన
దేశమ్ము  మనదని 
ఎరుకపరిచె పెద్దలు 
ఎదనిండా మురిపంగా  ... //వ // 

3. హాలికుని పంటలన్నీ 
ధాన్యాలా రాసులై 
సిరులనే కురిపించగ 
సిరి మువ్వై నవ్వింది ... //వ// 

4. చేతివృత్తి జనమంతా 
చేవగలిగి  నిలిచిరి 
పల్లె తల్లి ఒడిలోన 
ఆనందం విరియగా ... //వ // 

5. ముదితలంత కలిసిరి 
మురిపంగా వేసిరి 
కళ్ళాపి  వాకిల్లలో
ముత్యాల రంగవల్లి  ...//వ // 

6. ప్రకృతిలో పరమాత్మ
పేడ చూడు గొబ్బెమ్మా 
పరిశ్రమకు పట్టంతో 
పశువులకు పూజలు … //వ // 

7. సూక్ష్మంలో మోక్షమైన
యుద్ధనీతి కోడిపందెం
పతంగే  జీవితమని 
పరమార్థం బోధించే ... // వ// 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment