Tuesday, July 12, 2022

సూర్య తేజం తేదీ 07-02-2022 శీర్షిక : దినరుడు ....

 సూర్య తేజం 

తేదీ 07-02-2022
శీర్షిక : దినరుడు .... 
కవిత సంఖ్య : 213

చెట్టూ పుట్టా కొండా కోనా 
అణువణువున వెలిసి 
అకుంఠిత చైతన్యం రగిలించి 
వెలుగులీనుతున్న భానుడు .... 

ఏడు వారముల సంకేతంగా 
సప్తాశ్వరథమారూఢుడై 
సప్తవర్ణముల కలబోతలతో 
తేజరిల్లిన  ధవళ కాంతులను 
విరజిమ్ముతున్న దినకరుడు .... 

విరామమెరుగని వీరుడు 
తూర్పు పడమరల వలయంలో 
ఉత్తరాయణ ప్రవేశం చేసే 
శుభఘడియల రథసప్తమి ..... 

పత్ర హరితాల  ప్రాణకోటి 
అవనిశోభలను ఇనుమడింపజేసే 
పచ్చ తివాచీలను పరుస్తూ .... 
సర్వ జీవరాశికి సంపూర్ణమై 
సంచరించే రవికి ప్రణమామ్యహం .... 

సనాతనమైనా ... సాంప్రదాయమైనా 
సశాస్త్రీయమే మన హైందవాన .... 
కాల నిర్ణయాలకు కారణభూతం 
జీవన విధానాలకు తోడునీడ సూర్య తేజం .... 
ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడే .... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment