Tuesday, July 12, 2022

కాంతి రేఖలమై తేది : 10-02-2022 శీర్షిక : విజ్ఞాన చైతన్య దీప్తులు

 కాంతి రేఖలమై 

తేది : 10-02-2022
శీర్షిక : విజ్ఞాన చైతన్య దీప్తులు 
కవిత సంఖ్య : 216 

క్రూర మృగాల సాంగత్యంలో 
కుటిల జీవితాలననుభవించి 
చీకటి గుహల్లో చిక్కుకున్న 
చింతలు నిండిన బతుకులకు... 

మరణపు అంచుల అపాయాలలో 
మానవ సత్వర ఉపాయములే  
మరింత స్వీయ రక్షణలనిచ్చి 
కాంతిరేఖలై కష్టాలు తీర్చాయి ....  

అత్యవసరాలను పుణికి పుచుకుని 
అవసరాలను అక్కున చేర్చుకుని 
ఆడంబరాలవైపు అడుగులు వేస్తూ 
నాగరికతలో నడకలు  నేర్చుకున్నాడు .... 

అవసరాన జీవన గమన శత్రువులను 
గుర్తించుకుంటూ ... ఆసరాగా పశు 
మిత్రులనైనా  అక్కున చేర్చుకుంటూ 
జీవన సరళిలో కాంతిరేఖగా  మారినా  .... 

అంతర్గత శత్రువును జయించలేక  
అవిటితనాలను నిండుగా హత్తుకుని 
తీవ్రవాద సిద్ధాంతాలతో మానవాళి 
మనుగడకే మబ్బులు కమ్మిన చీకటై 
పోతుంటే.....  

ఆత్మ జ్ఞానాలను అవపోశన పట్టి 
ఇప్పటికైనా ఇనుమడించుకోకుంటే 
విజ్ఞాన చైతన్య దీప్తులను చేరదీసి 
కాంతిరేఖలమై ప్రసరించకుంటే... విశ్వ  
మానవాళి మనుగడే ప్రశ్నార్ధకమయ్యే  
ప్రమాద ఘంటికలు మోగక మానవు  ..... 

నగునూరి రాజన్న 
కరినగరము.  

No comments:

Post a Comment