Tuesday, July 12, 2022

తెలుగు వెలుగు తేది: 21-02-2022 శీర్షిక : వెలిగులీనిన దారి

 తెలుగు వెలుగు 

తేది: 21-02-2022
శీర్షిక : వెలిగులీనిన దారి 
కవిత సంఖ్య : 853

అక్కడక్కడ కానవచ్చినా  
అజ్ఞాతములనే  అనుభవించె 
తొలుత ఐదువందలేండ్లు ......  
అధికారికముగ మాత్రమే 
లభ్యమై ... లబ్ద సారస్వతమును 
చూపె.. మలి ఐదువందలేండ్లు ....  

ఐతరేయం  ఊతమిచ్చెను 
అక్కడక్కడ సమూహాలలో ... 
శాసనమున  ఉటంకించెను  
"నాగబు " ను నందనముగా ... 

కోటిలింగాల ముఖద్వారమై 
కోటలేలిన శాతవాహనులు 
కోరి నిలిపిరి తెనుగును ... 
“గాథాసప్తశతి”లోన  ఆనవాళ్లుగ  .....  

కమలం వికాసానికి దినకరుడిలా 
కలువకు నిశిరేడు చంద్రుడిలా
వేలు లక్షల...  భాషా పండితుల 
మేధో మదన భావ సంపదల 
కవన పూవనాలు ఎన్ని పూయించినా 
పరిమళాల సుగంధం వ్యాపించాలంటే 
పాలకుల పరితపనల దన్ను తోడవ్వాలి .....  

పొట్టిశ్రీరాములు పట్టింపులతో 
తెలుగువారన్న తెగువల గుర్తింపాయె ...  
తెలుగుదేశం పార్టీ స్థాపనతో 
తేటతెల్లమైన భాషా మాధుర్యం 
భారతాన వెలుగులీనే  భవ్యమై… 
మదరాసీ అన్న నోట 
తెలుగువారనడానికి… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment