రెప్పలు మూయని కిటికి
తేది: 15-02-2022
శీర్షిక : ఎప్పుడూ .....
కవిత సంఖ్య : 848
తూరుపు తలుపులు తెరుచుకోగానే
తప్పని తిప్పలే కంటికి
రెప్పలు మూయని కిటికీయై
అహర్నిశలు ఆశల దృశ్యాలను
బందిస్తూ భావనలను మూటగట్టి
బహుమతిగా మనసుకు చేరవేయ ....
తన్మయత్వాల తపనలతో అప్పుడప్పుడు
చూపుల బాణం నిలుపుకుంటే
తటపటాయించు మూసుకోడానికి
తుంటరి రెప్పల తలుపులు .....
నిప్పులు కుమ్మరించి నిలువరించినా
కరుణ రసాలను కార్చినా
జాలి చూపి దయలు కురిపించినా
దానవత్వాలతో దహించివేసినా .....
నవరసాలతో నగారా మోగించి
మనసున కలిగే మర్మాలకు
సప్త వర్ణాలు సంతరించుకుని
సదా అద్దమై ప్రతిబింబిస్తాయి .....
నిశ్చల నిశీధులలో తప్ప
జీవన గమనంలో చివరగా
పాప పుణ్యాల పరిహారాల తోవలో
పరితపనల భావనలతో
పరమాత్ముని దర్శనానికై
పరితపిస్తూ చూసే ఎదురుచూపుల్లో .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment