జల ప్రళయం
తేది : 22-11-2021
శీర్షిక : కాలుష్య రక్కసి
కవిత సంఖ్య :
కాలుష్యాలన్నీ కాలనాగుల్లా
బసులు కొడుతుంటే ...కాలం కాని
కాలంలో కరచాలనం చేస్తున్నాయి
వర్షాలు కకావికలం చేస్తూ…
పాలిథీన్లన్నీ పట్టం కట్టినట్టు
నగర ప్రహారీలౌతుంటే ....
భగ్గుమంటున్న కోటలను
చల్లార్చే ప్రయత్నమేమో వరుణుడిది.
ఖాళీ సీసాలన్నీ కదిలిపోతూ
కడలి చేరుతుంటే....విషతుల్యాలై
విరజిమ్ముతున్నాయేమో….
క్యుములో నింబసులై కుండపోతతో…
దూరాలోచనలు లోపించి దురాలోచనలు
మాత్రమే నింపుకుని…విధ్వంస రచనలే
వింతగా ఆస్తులు అంతస్తులుగా కూడబెట్టుకుంటున్న
మనిషికి తెలియ చెప్పే ప్రయత్నములో ఏమో…..
అన్నీ తెలిసినా…అలసత్వాల
మనిషి వింత ప్రవర్తనమయం….
స్వార్థాలను సంకనేసుకుని ...
భ్రమల నాటకాలు వీడకపోతే ....
అధోగతే ...
No comments:
Post a Comment