జానపదం…
తేది: 19-02-2022
శీర్షిక: మేడారం జాతర
కవిత సంఖ్య: 852
జాతరమ్మ జాతరో
సమ్మక్క జాతరా…
జనజాతర వనజాతర
సారలమ్మ జాతరా …
మేడారం అడవుల్లో….
మేను పులకరిస్తుంది…..
ఏడూ విడిచి ఏడచ్చే
ఎదురులేని జాతర
కరువులు కాటకాల
కష్టాలను ఎల్లవోసి
కడుపుకింత దొరుకుడే
కనా కష్టమంటుంటే…।
పన్నులను కట్టమన్న
పాలకులను ప్రశ్నించే..
జనమే నా పానమన్న
జంపన్న సోదరీ…
జనంకొరకు కోట్లాడి
పాణమిడిచి దైవమాయె
దయచూపి కోరికలు
దండిగనే తీర్చుతుండే…
గుడి గోపురం లేదన్న
సందేహం అక్కర్లే…
ప్రజల గుండెల్లోనే
పదిలమాయె క్షేత్రంగా
కొలవడానికోరూపం
కొరతని తలవమాకు
కోట్లాది గుండెల్లో
కొలువై ఉన్నది దైవంగా….
వేదమంత్రాలు లేవనే
సంశయాలు మానండి
వేల జనుల స్మరణలే
నామ జపం చూడండి…
హారతి తీర్థం లేదనే
అనుకోకు మనసులో..
హత్తుకుని ఊరడించె
అమ్మ మనసు సల్లంగా….
ఎత్తు బంగారాలే
ఎదనిండిన మొక్కులు…
తలనీలాలు ఓడిబయ్యం
తనువు నిండిన సమర్పణలు …..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment