అంశం : బెదురు చూపులు
తేదీ: 03-02-2022
శీర్షిక : బేల చూపులే…
కవిత సంఖ్య : 210
గమ్యం తెలియక గమనం
సాగించిన వేళ ...అకస్మాత్తుగా
అపాయాల ముంగిట నిలిచి
అసహాయతలు ఎదురైనప్పుడు ....
ఆశలు వదలక ఆశయం చేరలేక
అగమ్యగోచరంగా అడుగులు తడబడి
భయాల నీడల్లో బతుకు బండి
కదలాడుతున్న క్షణాలలో ...
అజ్ఞానపు నీడలలో అలమటించే
సమయంలో .... ఒక్కసారిగా జ్ఞానపు
వెలుగుల కాంతుల కంగారులలో...
మిలమిలల ధాటికి నిశ్చేష్టులైన వేళ ....
పరిచయించిన పల్లె ప్రపంచంనుండి
అపరిచిత వాడల పట్న ప్రపంచంలో
అడుగిడి... ఆకాశ హార్మ్యాల నిలువులలో
నిరాధార భూతమై .. ఆగమ్య గోచరాల
అలికిడి నీడలలో నిలిచినప్పుడు ......
ఎంతవారైనా ... ఎప్పుడో ఒకప్పుడు ...
ఎదో ఒక సందర్భంలో ....ఎదో ఒక
సంఘటనకు .... ఎదురు చూపుల
బెదురు చూపులే .... బేల చూపులే ....
ఆత్మ స్థైర్యం పెంచుకుని ….
అవపోషణలు పట్టుకుని…
ఆపత్కాలాలను అవలీలగా
ఎదుర్కో గలిగే ధైర్య సాహసాలు
సంతరించుతోవాలి….
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment