ప్రణయ గీతం
తేది: 12-02-2022
శీర్షిక : మనసు మురిసి పాడెనే
కవిత సంఖ్య: 846
మనసు మురిసి పాడెనే …
తనువు విరిసి ఆడెనే
ప్రియా … ఓ … ప్రియా……
అతడు…
పసిమి వన్నెల చిన్నాదానా
పున్నమెలుగుల వన్నెదానా
సొగసులన్నీ ఆరబోసీ .....
మరులతో మురిపించావా ..... // మనసు//
ఆమె…
మొరటు సైగల చిన్నవాడా
ప్రేమ కిటుకుల వన్నెకాడా
అందమంతా ఆరబోసి
సందకాడా ఎదురుచూస్తీ .... // మనసు//
అతడు…
కుసుమ పరిమళం శోభించ
తరువు తేనియ చుంబించ
వరసైన మరదలు నీవే
రసపట్టు జానవు కాదే…. // మనసు//
ఆమె…
దండి దొరవు నీవేగదరా
గుండె గుడిగా మలచనా
వెండి కొండల కొలువై ఉండే
అండదండల తోడు నీవే…. // మనసు//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment