Tuesday, July 12, 2022

మనసే కాగితమైతే ... తేది : 16-02-2022 శీర్షిక : మానవత్వం వైపు ....

 మనసే కాగితమైతే ...

తేది : 16-02-2022
శీర్షిక : మానవత్వం వైపు .... 
కవిత సంఖ్య : 218

అచ్చమైన స్వచ్ఛమే అయితే 
అపురూపకంగా చూసుకోవాలి  .... 
అప్పుడే పుట్టిన పాపాయిలా 
అరవిరిసిన కుసుమ కోమలంగా ....  

కపట నాటకాలకు తెర తీయక 
స్వార్థాల సంచులను దించేసి 
ఆశయాల గమ్యాలను చిత్రించి 
ముందు తరాలకు ముచ్చట గొల్పే 
విధముగా ...... 

గొలుసుకట్టు రాతలతో గోల గోల 
చేయకుండా .... ద్వందార్థాల 
దమన నీతులు పాటించకుండా ... 
మానవతా విలువలతో భద్రపరుచు ..... 

మలినమైన ఆలోచనలతో 
మనసు కాగితం నలిగిపోకుండా 
మల్లె పూల పరిమళాలతో 
మరో తరం చరిత్రలు చేరవేయాలి .... 

చిక్కు చిక్కు రాతలు కాకుండా 
వ్యర్థమైన పేలాపనలు లేకుండా 
అలంకార యుక్తంగా కవిత్వాలు 
జోడిస్తూ అందంగా సమర్పించాలి ..... 

విధ్వంసాలకు వీలు లేకుండా 
అక్రమాలకూ ఆనవాలు కాకుండా 
సత్యాలకు, సత్ప్రవర్తనలకు, సంఘ 
హితాలకు , దైవమంత పవిత్రాలకు
ప్రతిబింబంలా నిలపాలి  ...

అన్యాయాలకు కొమ్ము కాయక 
అధర్మాలకు చోటు కల్పించక 
ఆత్మీయతలను  అద్దుకుంటూ
మానవత్వాలకు  మూసపోయాలి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment