Tuesday, July 12, 2022

పుస్తక వినియోగం తేది : 17-02-2022 శీర్షిక : తరాలకు వారధి .....

 పుస్తక వినియోగం

తేది : 17-02-2022
శీర్షిక : తరాలకు వారధి ..... 
కవిత సంఖ్య : 96+9

వీణాపాణి విమల స్వరూపిణి 
హంస వాహిని ఆనందరూపిణి 
కామరూపిణీ కాత్యాయనీ...  
జ్ఞాన ప్రదాత...  ప్రతిరూపం 

శాస్త్రీయమైనా....సాంప్రదాయమైనా 
అంతరంగంలోని అలలను 
మస్తిష్కంలోని మంతనాలను 
బందీ అయిన భావ ప్రకంపనలను 
ప్రోది చేసుకుని నిక్షిప్తం 
చేసుకునే నేస్తం ..... 

మొగ్గలై ముడుచుకున్నా 
మొల్లలై విచ్చుకున్నా 
సదా పరిమళాలను వెదజల్లే 
నిశి చీల్పుల  విజ్ఞాన జ్యోతులు .... 

చర్విత చరణాలయ్యే 
చరిత్రలనెన్నింటినో  తనలో 
గత కాల జ్ఞాపకాలుగా నిలుపుకుని  
భవిష్యత్ తరాలకు బాటలు చూపు ..... 
తరాల మధ్య నిలిచిన వారధి ..... 

విజ్ఞానాలకు భాండాగారమై 
విచక్షణలకు దివిటీలై 
మేధో మధనాలకు మార్గమై 
జీవరాశిలో మానవాళిని విశిష్టంగా 
నిలిపిన హస్త భూషణం .... 

విజ్ఞాన బదిలీలకు విస్తృత 
అవకాశాలను విస్తరించిన ... 
వినూతన హస్త భూషణం 
వింతగా కొంతకాలం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment