Tuesday, July 12, 2022

రేడియో తేది: 13-03-2022 శీర్షిక: గౌరవ సూచిక…

 రేడియో 

తేది: 13-03-2022
శీర్షిక: గౌరవ సూచిక… 
కవిత సంఖ్య: 96+7 

ఎందరెందరో మహానుభావులు 
బాటలు వేసిన బహదూరులు 
మాక్స్ వెల్ , హెర్టజ్ , బ్రాన్లీ 
ప్రాథమిక ప్రయోగాల ముగింపుగా ... 

యుగాలనాటి మాటల మాంత్రికతలా 
శాస్త్ర సాంకేతికతల ఆవిష్కారం… 
ఆధునికత జోడింపులతో  అమూల్యం 
శబ్ద సంకేతాల ప్రసారాల రేడియో ...  

పరిపూర్ణతల ప్రతిఫలముగా 
మార్కొని చేరుకునే  రేడియోగా 
వింతైన పరికరమై.. విశ్వవీథి
గగనాన విశిష్టతల కబుర్ల పెట్టెగా ... 

అలనాటి రోజుల్లో అద్భుతాల గనిగా 
ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణవాయువుగా
ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా 
సకల జనుల వార్తాహరునిగా.. 
వైవిధ్యభరితమైన వినోదాల భరిణగా...
సాహిత్యాలకు సారధిగా.. కళాకారులకు 
పెన్నిధిగా...సంఘ గౌరవాల సూచికై నిలిచె.. 

తొంబదిలదాకా తొడగొట్టి 
సై అన్న ఆకాశవాణి.... 
దూరదర్శన్  జీవితాలలో 
దూరగానే...  దూరం జరిగి 
మెల్లి మెల్లిగా మాయమౌతున్నది... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment