ఆశల ఆరాటమే
తేది: 14-02-2022
శీర్షిక : శోభాయమానం కావాలి ...
కవిత సంఖ్య : 96+8
రూపమున్న మనిషికి
రూపం లేని మనసే మందిరం ....
అనంత జీవరాశిలో
ఆలోచనా సెలయేళ్ళు
మనిషికి మాత్రమే సొంతం ....
ఆలోచనల చిక్కు ముడుల నుండే
ఆశలకు ఆరాటమై అంకురమై ....
ఆశయానికి నాంది పలుకుతుంది ...
ఆశ .. ఆశయాల... గమనమే
అభివృద్ధికి బాటలు వేస్తూ ...
నవ నాగరికతలు నేర్పించి ....
సాంకేతికతల సొబగులద్దింది ...
ఆవిష్కరణలకు అంకురార్పణలు
గావించి... గ్రహాల స్థితి గతులను
చదివేసి .... ఖగోళాన్ని కంఠస్థం
చేయడానికి గళం కలిపింది .....
జీవరాశి మిన్నంటూ విర్రవీగడమే
గాని ... మంచి చెడుల విచక్షణలు
తెలిసి ... తెలిసి.... మూగ నోము
వ్రతమాచరిస్తూ ....చెడుకు కొమ్ము
కాస్తూ కొన్నిసార్లు మూర్ఖులై
పోతున్నారు ....
ఆశలు ... అత్యయాశలైతే ...
స్వార్థానికి సంచులు తగిలించి
తలకెక్కి చికాకులను సృష్టించి
మాయని మచ్చలను మూట
కడుతుంది ....
విజ్ఞానాల కొమ్మలకు
విచక్షణ కుసుమాలు
పరిమళాలను అద్దితేనే
మానవాళి శోభాయమానమౌతుంది .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment