కన్నీటి చెలిమెలు
కవిత సంఖ్య : 211
శీర్షిక : అభయ హస్తాలు
తేది: 04-02-2022
సాటి మనుషుల సతాయింపులో
రెక్కాడితే గాని డొక్కాడని నిత్యకూలికి
పని దొరక్క పస్తులుండే సమయములో ....
ప్రాణ సమమయిన పసికూనలకు పట్టెడన్నం
పెట్టలేకపోవడం…
దేశకాలమాన దండి పరిస్థితులో ....
ఒంటరితనంలో జంటగ దొరికేవి…
కష్టాలలో తోడుండి పలకరించేవి..
దుఃఖాలలో ఎద బరువులు దింపేవి…
ప్రశాంతతల పరుపులు పరిచి జోల పాడేవి….
ఆత్మీయతల అనుబంధం దూరమవడమో
అనురాగాల బంధం తెగిపోవడమో…
అతిముఖ్యమైన సంపద పోగొట్టుకోవడమో…
జరిగినప్పుడు…
అనునయించి ఆదమరిచి నిదర పుచ్చేవి…..
పిరికితనాల గంపగుర్తుగా చేసుకుని
బక్క చిక్కిన ఒంటరితనాలను వెక్కిరిస్తూ...
న్యూనతల తలంటు పోసుకుని…
ఆరున్నొక్క రాగాలాపనలకు తావిచ్చేవి …
సమతామూర్తులు సన్నుతించి
మానవత్వాలను కదిలించయినా
అభయహస్తాలను అందించయినా…
అమృత హృదయాలు వర్షింపజేసయినా…
చేయూతల పరిమళాలు వెదజల్లి ….
సర్వే జనా సుఖినోభవా అనే విధంగా మనమంతా
చేతులుకలపాలి …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment