Tuesday, July 12, 2022

తృణమే శరణ్యమా తేది : 10-02-2022 శీర్షిక : అనారోగ్యాలకు అడ్డు కట్ట

 తృణమే శరణ్యమా

తేది : 10-02-2022
శీర్షిక : అనారోగ్యాలకు అడ్డు కట్ట 
కవిత సంఖ్య : 844  

నాగరికతల నీడల్లో నడకలు నేర్చి 
పారిశ్రామికీకతల జాడల్లో పరుగులు 
పెట్టి...సాంకేతికతల అవపోశనలతో ... 
నిలకడ లేని జీవితాలైపోయి .... 
ఆరోగ్యాలకై అర్రులు చాపే  పరిస్థితి .... 

కాల గమనంలో కదిలిపోయేది 
సహజ సిద్దమైనదీ ప్రపంచాన....  
మార్పులోనే పుట్టి మార్పులోనే 
పెరిగినా ...ప్రత్యేకంగా గుర్తించం.. 

అవపోశనలు పట్టిన అనన్యమైన 
సాంప్రదాయాలను అటకెక్కించి 
ఆధునిక ఆహార పోకడలతో 
ఆరోగ్యాలను ఫణంగా పెట్టాం .... 

చిర్రు బుర్రులు మాయం చేసి 
చిరునవ్వులు పూయించాలని 
విజ్ఞుల కోరిన చిరు కానుకలే 
వింతగా పట్టుకున్న రహస్యం 
చిట్టి పొట్టి ధాన్యాల సామర్థ్యం .... 

సజ్జలు జొన్నలు సంకటికోసం 
రాగులు రోగ నిరోదకతలకు 
అరికెలు కొర్రలు యాంటీఆక్సిడెంట్స్ గా 
సామలు అధిక జీర్ణ శక్తిల నిస్తూ .... 

తీపి చేదు వగరు పులుపు ఉప్పు
కారాల  షడ్రుచులను కూడా పంచుతూ…
వాత పిత్త పైత్యాది అనారోగ్యాలకు 
అడ్డు కట్టలు వేసి  రోగనిరోధకతలకు 
భాండాగారలౌతున్నాయి ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment